March 25

0 comments

Titus Chapter 2

By Dr. Joel Madasu

March 25, 2020

#bsn.bibleprabodhalu, New Testament, Titus

తీతు 2 వ అధ్యాయము

తీతు 2:1 - "నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము."

''కాని నీవు'' అనే పదము 1:10-16 లో వున్నప్రజలకు, తీతుకు మధ్య వున్న తేడాను చూపిస్తుంది. కావున పౌలు ఈలాగు చెప్పాడు, క్రేతీయులు (ప్రత్యేకించి, యూదులైనవారు పాడుచేయు సంగతులను చేస్తున్నారు. అయితే, నీవు వారికి భిన్నముగా ఉండాలి అని అర్ధం. అది, హితబోధను బోధించే విషయములో (సరియైన, అనుకూలమైన సంగతులు). మంచి బోధతో (ఆరోగ్యకరమైన బోధ) అని అర్థం. మనుష్యుల కట్టడాలుగా చెప్పబడిన వాటికి కూడా భిన్నముగా ఉండాలని అర్ధం. 

తీతు 2:2 - "వృద్దులు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపాములేనివారై యుండవలెను."

రెండవ వచనము నుండి, వివిధ వర్గాలకు చెందిన వారికి సూచనలు ఇస్తున్నాడు, ప్రత్యేకించి ఇక్కడ, ''వృద్ధులను'' గూర్చిన సూచనలు ఇస్తున్నాడు (ఇదే వయసుకు చెందిన వారిని గూర్చి మరియు అధ్యక్షులు, పరిచారకులుకు తగిన సూచనలు 1వ తిమోతి 3:2, 8 ఇవ్వడం జరిగింది) . 

వారు ''మితానుభవముగలవారై'' యుండాలి - అనగా, వారి యొక్క భావోద్వేగాలను మరియు శరీర కోరికలను అదుపుపు చేసుకొనగలవారై యుండాలి.

''మాన్యులై యుండాలి'' - అనగా మంచి పేరు లేక మంచి వ్యక్తిత్వం 

''స్వస్థబుద్ధి'' - మంచి ఆలోచనలు అని అర్ధం 

''విశ్వాస, ప్రేమ, సహనముయందు లోపాములేనివారై యుండాలి'' - లోపము లేకుండుట లేక ఆరోగ్యము అని అర్ధం. విశ్వాసము, ప్రేమ, మరియు సహనము అనే మూడు విషయాల యందు లోపము లేని వారుగా ఉండాలి (ఇటువంటి హెచ్చరిక 1వ తిమోతి 6:11 లోను, 2వ తిమోతి 3:10 లో కూడా ఇవ్వబడింది). 

తీతు 2:3 - "ఆలాగుననే వృద్ధ స్త్రీలు కొండకత్తెలను, మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులు కలవారై యుండాలి. మంచి ఉపదేశము చేయువారుగా ఉండాలి."

''ఆలాగుననే'' అదేవిధముగా అని కూడా చెప్పవచ్చును - అనగా వృద్ధులైన పురుషుల వలెనె వృద్ధులైన స్త్రీలు కూడా ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండాలి. వారు పరిశుద్ధమైన లేక ప్రత్యేకింపబడిన జీవితాన్ని కలిగి ఉండాలి. ''భయభక్తులు కలిగి యుండుట'' అనే పదము పరిశుద్ధత లేక భక్తి అనే అర్ధం ఇస్తుంది.

వారు కొండకత్తెలుగా ఉండకూడదు. అనగా వారు కొండెములు లేక పుకారులు చెప్పకూడదు .

మరియు, వారు మిగుల మద్యపానాసక్తులు గా ఉండకూడదు. క్రేతులో వున్న స్త్రీల యొక్క పరిస్థితి ఇది. ఇంతకుముందు చెప్పబడిన కొండకత్తెలు అనే పదాన్ని ఒకసారి గమనించండి. ఈ పదము అపవాదికి కూడా ఉపయోగించబడిన పదముగా వున్నది. NAC లో ఈలాగు చెప్పబడింది, ''అబద్దములు చెప్పడములో, తప్పుడు నేరములు మోపడములో, మరియు కొండెము ప్రచారము చేయడములో తమ నాలుకలు ఎవరయితే అదుపు చేసుకోలేరో వారు స్వయముగా సాతాను యొక్క పని చేస్తున్నట్టే.'' 

యిక్కడ వారు త్రాగకూడదు అని చెప్పబడింది. మద్యపానము అనేది కొండెములు చెపుతాను ప్రోత్సహిస్తుంది.

అయితే వారు ఎలాగూ ఉండాలో ఈ వచనములోని తరువాత భాగము వివరిస్తుంది - ''వారు మంచి ఉపదేశము చేసే వారుగా ఉండాలి.'' సంఘములో వున్న వృద్ధ స్త్రీల యొక్క బాధ్యత ఇదే అయి ఉండాలి. ''ఉపదేశించుట' అనే పదము ''సూచనలు'' యిచ్చుట అనే పదమునకు సమాంతరము కాదు,'' కాని దానికి యొక్క అర్ధం ఏమనగా, మంచిని లేక నైతికంగా సరిఅయినదానిని బోధించే వ్యక్తి అని అర్ధం''- ''మంచిని బోధించేవారు, సరిఅయిన దానిని బోధించేవారు.'' కావున, యిది అనధికారికంగా బోధించే పద్దతి.

తీతు 2:4-5 - "యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధిగలవారును, పవిత్రులును,ఇంటవుంది పని చేసుకొనువారును మంచివారునై యుండవలెను."

వృద్ధ స్త్రీలు మంచి ఉపదేశము చేయుట ద్వారా యవ్వన స్త్రీలను హెచ్చరించేవారుగా ఉండాలి. మరలా, వృద్ధ స్త్రీలు ప్రవర్తన యందు భయభక్తులు ఎందుకు కలిగిన వారుగా ఉండాలో, కొండకత్తెలుగా, మిగుల మద్యపానాసక్తులుగా వుండకూడదో  మరొక ఉద్దేశాన్ని పౌలు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే, వారు యవ్వన స్త్రీలకూ మాదిరిగా ఉండాలని ఫలితముగా వారు కొంతమందిని జ్ఞానయుక్తమైన ప్రవర్తన కలిగి యుండుటకు సరిఅయినది లేక మంచిని తెలుసుకునేవారిగా, వారి యొక్క భర్తలను, పిల్లలను ప్రేమించే వారుగా ఉండులాగున తర్బీదు ఇచ్చేవారుగా వుంటారు, మరియు బోధించే వారుగా వుంటారు. 

భర్తలను ''ప్రేమించుట'' అనే పదము ఈ అర్దాన్ని సూచిస్తుంది:'' భర్త పట్ల పట్ల వాంఛ కలిగి యుండుట - ఒక స్త్రీ తన భర్త పట్ల ప్రేమ కలిగి యుండుట, ఒక స్త్రీ తన భర్త పట్ల ప్రేమ కలిగి యుండుట.'' 

శిశువులను ''ప్రేమించుట'' అనే పదము ఈ అర్దాన్ని సూచిస్తుంది: "ఒకరి యొక్క సొంత వారసత్వము పట్ల ప్రేమ కలిగి యుండుట - వారి యొక్క సొంత పిల్లలను ప్రేమించుట.''

వారు స్వస్థబుద్ధి మరియు పవిత్రులుగా ఉండవలెను - ''ఒకరి యొక్క ప్రవర్తన మంచిగాను మాదిరికరమైన ప్రవర్తన కలిగి యుండుట - స్వస్థబుద్ధి, నిబ్బరమయిన బుద్ది, మాదిరికరమైన'' - పవిత్రత అనగా పరిశుద్ధత కలిగి ఉండటం.

''ఇంట పని చేసుకునే వారుగా ఉండాలి'' - ఇంటిలో పనిలో ప్రయాసపడేవారిగా ఉండుట, లేక ఇంటిని కాపాడుకునే వారుగా ఉండుట.

''మంచి వారుగా ఉండాలి'' - మంచిగా వుండే నైతిక లక్షణాలు, మంచి స్త్రీలుగా ఉండుట.

తమ భర్తలకు లోబడే వారుగా ఉండాలి.     

ఇది యవ్వన స్త్రీలు వారి యొక్క భర్తలతో కలిగి వుండే బాంధవ్యమును గూర్చినది. ఆమె ఖచ్చితముగా లోబడే స్త్రీగా ఉండాలి. ఈ పదము నిరంతరంగా, వ్యక్తిగతముగా లోబడే మనస్సును కలిగిన దానిని సూచిస్తుంది. 

ఎందుకు లోబడాలి?

  1. ఇది దేవుని యొక్క చిత్తము లేక దేవుని యొక్క ఆఙ్ఞ 
  2. లోబడుట  ద్వారా దేవుని నామము దూషింపబడకుండా ఉంటాది. 

NIGTC  చెప్పేది ఏమనగా, దేవుని యొక్క'' నామము'' అనే స్థానములో దేవుని యొక్క ''వాక్యము'' అనే వుండే ఆలోచన ఇది. దేవుని యందు భయభక్తులు కలిగే యుండె ప్రవర్తనను, చెడ్డ మాటల నుండి కాక దేవుని వాక్యం ద్వారా కాపాడుకోవచ్చు అని పౌలు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి, భార్య తన యొక్క భర్తకు లోబడకుండా వున్నపుడు లేక, అతనిని ప్రేమించకుండా వున్నపుడు, లేక అపవిత్రముగా వున్నపుడు, క్రైస్తవేతరులు క్రైస్తవ్యము మనుష్యులను ఇంతకుముందు కన్నా చెడ్డవారిగా చేస్తుంది కాబట్టి దాని యొక్క వాక్యము పనికిరానిది మరియు చెడ్డది అని చెప్పుకుంటారు.

ఏది ఏమైనప్పటికి, Gordon Fee అనే భక్తుడు ఇలా చెప్తాడు, లోబడుట అనేది ''సంస్కృతి'' లో ఒక భాగము అని చెప్తాడు. అతడు పొరపాటు పడ్డాడు. ఈ ప్రవర్తన సంస్కృతి పరంగా ఆమోదయోగ్యమైనదా కాదా అనేది కాదు సమస్య ఇక్కడ. ఈ ప్రవర్తన అప్పుడు ప్రోత్సహించబడింది, ఇప్పుడు కూడా ప్రోత్సహించబడుతుంది.

NIGTC ఈలాగు చెప్తుంది , 

Fee మరియు ఇతరులు ఈ వాదనను తప్పుగా అర్ధం చేసుకొనుట ద్వారా ఈ ప్రవర్తన కేవలం అక్కడి సంస్కృతికి మాత్రమే చెప్పబడింది అనే ధోరణిలో చెప్తున్నారు. ఫలితముగా పౌలు దానిని దేవుని దృష్టిలో సరిఐనది అన్న కోణములో చూడలేదు అనేది వారి యొక్క వాదన. అయితే Fee అనే వ్యక్తి ఆ జాబితాలో వున్నా వాటిని గుర్తించక కేవలం చివరిగా వున్నా దానిని మాత్రమే సంస్కృతిపరంగా చూసాడు. లోబడుట అనే పౌలు యొక్క వాదన భార్య భర్తలకు సంధించింది ఇక్కడ. మంచి ప్రవర్తన కలిగియుండమని పౌలు ప్రోత్సహించిన విధానం అప్పటి కాలానికి సంధించిన సంస్కృతి లో క్రైస్తవేతరులకు మాదిరిగా వుంటాదని Fee అంచనా వేసాడు. మరియు పౌలు చెప్పిన విషయాలలో జాబితా అప్పటి కాలానికి సరిపోతున్నవి. అయితే ఇది సంస్కృతి పరమైన అంశం మాత్రమే, సంస్కృతితో  సంబంధం లేకుండా నైతిక అంశానికి సంబందించినది కాదు అని అంచనా వేయడం పొరపాటే. ఇక్కడ మరియు మరికొన్ని చోట్ల పౌలు అన్యులైన క్రైస్తవేతరులను కూడా దృష్టిలో ఉంచుకుని చెప్పడం జరిగింది (1వ తిమోతి 5:8, 1వ కొరింథీ 5:1) ఎందుకంటే అన్యులైన వారి యొక్క నైతిక ప్రవర్తన గూర్చి పౌలు ఇలా భావించాడు. ''ధర్మశాస్త్రము వారి హృదయములయందు వ్రాయబడింది (రోమా 2:15) మరియు కొన్ని తప్పిదాలనుండి సరిఐనది ఏంటో వారికీ తెలుసు కాబట్టి, వారికి తెలిసి కూడా ఈ జ్ఞానమును అభ్యసించటం లేదు (రోమా 1:32).

తీతు 2:6 - "అటువలెనే స్వస్థబుద్ధి గలవారై యుండవలెనని యవ్వన పురుషులను హెచ్చరించుము."

"అటువలెనే" - ఇప్పుడు పౌలు యవ్వన పురుషులను గూర్చిన సూచనలు ఇస్తున్నాడు యవ్వన స్త్రీలు  ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలని కోరబడ్డారో, అలాగే యవ్వన పురుషులు కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని కోరబడుతున్నారు. 

యవ్వన పురుషులు స్వస్థబుద్ధి కలిగి ఉండాలి. అనగా, యవ్వన పురుషులు అన్ని విషయాలలో మంచి వారుగా ఉండాలి. 

తీతు 2:7 - "నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాత్క్యంతో కూడినదిగా ఉండవలెను."

''ప్రతి సత్కార్యముల విషయములో నిన్ను నీవే మాదిరిగా కనపరచుకో'' - పౌలు యొక్క ఆలోచనలు తీతును వ్యక్తిగతముగా హెచ్చరించే విధముగా తిరిగాయి. తీతు మాదిరికరముగా ఉండాలి. తన బోధ యందు మోసము లేని వాడుగా, మాన్యమయినవాడుగా ఉండాలి (1వ తిమోతి 4:12 ,13 కూడా చూడుము).

''నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనది గాను ఉండాలి''- తీతు యొక్క గొప్ప బాధ్యతలతో కూడినది. అతని యొక్క పాత్ర క్రెస్తవ సమాజాన్ని నడిపించేదిగా వుంది. కాబట్టి సత్కార్యముల విషయములో మాదిరికరముగా ఉండమని పౌలు తీతును కోరుతున్నాడు - ప్రజలు నాయకుని యొక్క జీవితాన్ని చూసి దానిని అవలంభిస్తారు. తీతు మోసం లేని వాడుగా (మంచివాడిగా), మరియు మాన్యమైనవాడుగా (గౌరవమైన) కూడా ఉండాలి. 

తీతు 2:8 - "నీ  ఉపదేశము నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండాలి ఎందుకంటే పరపక్షమందుండువారు మనలనుగూర్చి చెడుమాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు."

''నీ ఉపదేశము నిరాక్షేపమైన హిత వాక్యంతో కూడినదిగా ఉండాలి''- తీతు యొక్క బోధ ఆరోగ్యకరమైనదిగా ఉండాలి మరియు నిరాక్షేపమైనదిగా ఉండాలి అనగా ఒకరు తప్పు పట్టే విధముగా ఉండకూడదు. దాని అర్ధం, తీతు యొక్క బోధ విమర్శించబడకూడదు అని కాదు. మరి ఏంటి దీని  అర్ధం ? తీతు తన యొక్క బోధను హితమైనదిగా బోధించాలి.          

''కావున పరపక్షమందుండువారు మనలను గూర్చి చేదు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు'' - కావున అనే పదము ఉద్దేశాన్ని తెలిపే మాట. తీతు యొక్క ఉపదేశము పరపక్షమున వున్నా వారికి సిగ్గు కలిగించాలి అని పౌలు తెలియచేస్తున్నాడు. క్రైస్తవ్యాన్ని తప్పు పట్టే వారికి ఎటువంటి ఆధారము కూడా తీతు ఇవ్వకూడదు. తద్వారా దేవుని వాక్యము దూషింపబడకుండా ఉంటాది (5వ వచనము). 

"పరపక్షమందుడువాడు" - బహుశా ఇది అబద్ద బోధకుని సూచిస్తుంది. పరపక్షమందువాడు (వ్యతిరేకించేవారు ఎవరినైనా సూచిస్తుంది). 

మనలను గూర్చి చెడుచెప్పనేరక యుండునట్లు అనే మాట పౌలును కూడా కలిపి చెప్తుంది. 

ఇక్కడ అంశం ఏంటి అంటే, ఈరోజు ఒకవేళ తీతు యొక్క ఉపదేశము అంట మంచిగా వున్నట్లైతే, అది సహజముగానే వ్యతిరేకించే వ్యక్తిని సిగ్గుపరుస్తుంది. ఎందుకంటే (వ్యతిరేకించే వ్యక్తి) వారి దగ్గర అతనిని గూర్చి చెప్పడానికి ఏమి ఉండదు కాబట్టి. 

దాసులను గూర్చిన సూచనలు

తీతు 2:9-10 - "దాసులైనవారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలకరించునట్లు, తమ యజమానులకు ఎదురుమాటకు చెప్పక ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చరించుము."

పౌలు ఇప్పుడు దాసులను గూర్చిన అంశాన్ని మాట్లాడుతున్నాడు.

దాసులు తమ యజమానులకు అన్ని విషయములలో లోబడి యుండాలి (విధేయత చూపాలి).

వారు అంగీరంపదగినవారుగా ఉండాలి అనగా అన్ని విషయాలలో సంతోషపెట్టె వారుగా ఉండాలి. 

వెనక మాట్లాడని వారుగా ఉండాలి - అనగా ఎదురు మాట చెప్పని వారుగా ఉండాలి.

"అపహరింపక" - ''ఒకరి యొక్క సొంత ఫలితాలను, ధన నిధులను దుర్వినియోగపరచడం.''

ఈ రెండు అంశాలు దాసుల యొక్క సమస్య - ఎదురు మాట చెప్పటం మరియు అపహరించటం, కాబట్టి అటువంటి విషయాలు దాసులైనవారు చేయకూడదు కానీ వారు వారి యొక్క నమ్మకత్వాన్ని కనుపరచాలని, పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు. వారు ఖచ్చితముగా కనుపరచాలి అనే పదము సాధ్యమయ్యే అర్దాన్ని ఇస్తుంది - కనుపరచుట లేక చూపించుట.

ఇవన్నీ కలిగి యుండటానికి పౌలు తగిన కారణాన్ని ఇస్తున్నాడు. అన్ని విషయముల యందు దేవుని ఉపదేశమును అలంకరించుకొనునట్లు. పౌలు యొక్క ఉద్దేశము ఏమనగా దేవుని ఉపదేశము ఒక అలంకారంగా ఉంటాది అని అర్ధం.

దాసులు ఈ విషయాలన్నిటిలో వారి యొక్క నమ్మకత్వాన్ని కనుపరచుట ద్వారా ఇతరులు దేవుణ్ణి దూషించడానికి అవకాశం ఉండదు.

వీటన్నిటి యొక్క సారంశం ఏమనగా, క్రైస్తవులు మంచిగా వున్నా జీవితాన్ని మరియు నమ్మకత్వముతో కూడిన జీవితాన్ని మరియు కొన్ని జీవన విధానాలలో తేడాను చూపించాలనేది పౌలు చెప్పే అంశంగా వున్నది. అయితే, ప్రాముఖ్యమైన మరియు ప్రాథమికమైన ఉద్దేశం ఏమనగా దేవుని యొక్క వాక్యము క్రైస్తవుల ద్వారా దూషింపబడకూడదు.     

క్రైస్తవ జీవితము యొక్క సిద్ధాంతము:

తీతు 2:11-14 "ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రతక్షతా కొరకు ఎదురు చూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను, నీతితోనూ, భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్ను తానే మనకొరకు అర్పించుకొనెను."

ఈ వాక్య భాగము 1:10-2:10 వున్నా వచనాలలో ఇవ్వబడిన సూచనలకు సిద్ధాంతపరమైన పునాదిగా వున్నది.

"అందరికి రక్షణ తెచ్చుటకై, దేవుని కృప ప్రత్యక్షమైనది" - రక్షణ యొక్క సార్వత్రిక ఉద్దేశాన్ని పౌలు తెలియచేస్తున్నాడు. అదేమనగా, రక్షణ అందరికి అందజేయబడుతుంది.

''ఏలయనగా'' అని వాడబడిన పదము, ఇంతకుముందు సూచనలు ఇవ్వబడిన బాగముతోను, ఇప్పుడు చెప్పబడుతున్న వాక్య భాగముతోను అనుసంధానించబడుతుంది. ''దేవుని కృప'' అనే పదము ఈ వాక్యభాగము యొక్క ప్రధాన అంశముగా వున్నది (11 -14). 

పౌలు ఇచ్చిన సూచనలకు ఆధారము 11 -14 వచనాలలో చెప్పబడినది.

కానీ "దేవుని యొక్క కృప ప్రత్యక్షమాయెను" అన్నమాటకు అర్ధం ఏమిటి? ప్రత్యక్షమాయెను అనేది కర్తరి వాక్యము. క్రియ జరిగింది అని అర్ధం - దేవుని కృప ప్రత్యక్షమాయెను అనగా అర్ధం కృప ప్రత్యక్షమయాయెను అనగా చరిత్రలో క్రీస్తు శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు అని అర్ధం. ఆ క్రియ తరువాత సువార్త ద్వారా ప్రకటించబడింది మరియు దాని ద్వారా రక్షణ అందరికి తీసుకొని రాబడినది అని అర్ధం (NIGTC, 318 -19). 

"సమస్త మనుష్యులకు" అనగా అర్ధం ఏంటి? - అన్ని వర్గాల ప్రజలకు, దాసులకు కూడా అని అర్ధం. ''సమస్త'' అనే పదము లో వున్నా ప్రపంచములో వున్నా అందరు క్రైస్తవులమైన మనము కూడా ఇమిడి వున్నాము. 

కృప యొక్క మొదటి పని ఏమనగా సంస్థ మనుష్యులకు రక్షణ అందించడం. రక్షణార్థమైన (soteriological) ఉద్దేశము. కృప యొక్క రెండవ పని ఏమనగా క్రైస్తవులను తర్భీదు చేయడం. ఎందుకంటే, క్రైస్తవులు ఆయన యొక్క సొంత స్వాస్థ్యమై వున్నారు. 

బోధించుచున్నది అనే పదము కృప ''ప్రత్యక్షమవుటలో'' గల ఉద్దేశాన్ని తెలియచేస్తుంది.  

అయితే, ఏమి బోధిస్తున్నది ఈ కృప? భక్తి హీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలని బోధిస్తున్నది. భక్తి హీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి (గలతీ 5:16, 24) అయితే, స్వస్థబుద్ధితోను, నీతితోనూ, భక్తితోను బ్రతుకుతూ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ బ్రతకాలి.

దేవుని కృప ఒకసారి ప్రత్యక్షమైనది, మరల రెండవసారి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు రెండవ రాకడలో.

''ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్ను తానే మనకొరకు అర్పించుకొనెను."

తరువాత అంశముగా క్రీస్తు ఏమి చేసాడో వివరిస్తూ, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని పౌలు తెలియచేస్తున్నాడు.

మనలను విమోచించడానికి తనను తానే అర్పించుకున్నాడు. మనలను దుర్నీతి నుండి విమోచించాలని మరియు తన కోసం ప్రజలను ప్రజలను సొత్తుగా చేసుకొనుటకు.

క్రీస్తు తనను తానూ అర్పించుకొనుటకు రెండు ఉద్దేశాలు వున్నాయి:

  1. సమస్త  దుర్నీతి నుండి ప్రజలను విమోచించుటకు (కీర్తన 130 : 8).
  2. తన కోసం పవితరపర్చుకొని ప్రజలను తన సొత్తుగా చేసుకొనుట కొరకు (యెహెఙ్కేలు 37:23) తన కోసం ప్రజలను ఆయన ప్రత్యేకపరచుకుంటున్నాడు (నిర్గమ 19:5). 

''సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండుట'' - ఎవరు సత్క్రియల యందు ఆసక్తి కలిగి వుంటారు? ఎవరైతే విమోచించబడ్డారో వారు. వారు సత్క్రియలు అనే వ్యక్తిత్వముతో నింపబడి వుంటారు.

తీతు 2:15 - "వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచుండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకుము."

''వీటిని గూర్చి బోధించుము'' ఇది తీతుకు పౌలు ఇచ్చిన సూచన. ఈ యొక్క ఆజ్ఞ రెండు వైపులా సూచిస్తుంది. ఒకటి హెచ్చరించాలి, రెండు సంపూర్ణాధికారముతో ఖండించాలి.

తీతు తన సమాజములో ప్రత్యేకించి క్రేతీయుల మధ్యలో మాదిరిగా వున్నాడు. పౌలు తరువాత అంశముగా చెప్తూ నిన్నెవనిని తృణీకరింపనీయకుము అని చెప్తున్నాడు (యవ్వనము అనే పదము తీసివేయబడినది). 

Written by Dr. Joel Madasu; Trans. Bro. Samuel Raj.

Dr. Joel Madasu

About the author

{"email":"Email address invalid","url":"Website address invalid","required":"Required field missing"}
>