April 3

2 Timothy Introduction

తిమోతికి వ్రాసిన 2 వ పత్రిక 

ఉపోద్గాతము.

తిమోతి కి వ్రాసిన రెండవ పత్రిక వ్యక్తిగతమైనది. ఇది పౌలు వ్రాసిన పత్రికలలో చివరిది కూడా. 4:6-8 లో, తాను త్వరలో మరణించబోతున్నట్టుగా ప్రస్తావించాడు. ''నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది. మంచి పోరాటం పోరాడితిని. నా పరుగు కడా ముట్టించితిని. విశ్వాసము కాపాడుకొంటిని.'' ఇక్కడ వ్రాయబడిన మాటలను గమనించండి. ''నేను వెడలి పోవు కాలము సమీపమైయున్నది'' ''మరియు నా పరుగు కడా ముట్టించితిని.'' ముగించాను అనే క్రియ ఖచ్చితమైన అంశాన్ని సూచిస్తుంది. ఇంతకుముందే క్రియ జరిగింది అని అర్ధం. పౌలు ఇప్పుడు ప్రత్యక్ష పరిచర్యలో పాల్గొనటం లేదని కూడా అర్ధం చేసుకోవచ్చు. 

పౌలు రెండవసారి బంధించబడినపుడు ఈ పత్రికను వ్రాసి ఉండవచ్చు అనే ఆధారము కూడా 4:16-18 వచనాలలో కనపడుతుంది. ''నేను మొదట సమాధానము చెప్పినపుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు. అందరు నన్ను విడిచి పోయిరి. ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక.''

NICNT లో Towner ఇలా చెప్తాడు, తిమోతి 2 వ పత్రిక పౌలు పత్రికలైన తిమోతి 1వ పత్రికకు మరియు తీతు పత్రికకు మించిన వ్యక్తిగతమైన పత్రిక. పత్రిక యొక్క స్వభావములోను మరియు సాహిత్యములోను మరియు ఉద్దేశములోను తిమోతి 2వ పత్రిక ఎక్కువ సన్నిహిత సంబంధాన్ని కలిగి వుంది". Black మరియు Dockery ఇలా చెప్తారు, "తిమోతి 2 వ పత్రికలో వున్నా పరిస్థితిలు వేరు అయినప్పటికి మరల ఈ పత్రిక సువార్త నిమిత్తము శ్రమపడుట అనే అంశమును ప్రాముఖ్యముగా వివరిస్తుంది." 

ఈ పత్రిక యొక్క స్వభావము, వ్యక్తిగతమైనది అనే విషయము ఈ క్రింద వచనాలలో కనపడుతుంది.

''కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి ఐనను, ఆయన ఖైదీనైనా నన్నుగూర్చి ఐనను సిగ్గగుపడక దేవుని శక్తిని బట్టి సువార్తనిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడై యుండుము'' (2వ తిమోతి 1:8). 

''క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై, నీవు నావలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము.'' 2వ తిమోతి 1:13.

1:8 వచనంలో వున్న కొన్ని మాటలను గమనించండి. - ''సిగ్గుపడక,'' ''శ్రమనుభావములో పాలివాడవైయుండుము'' ఇవి వ్యక్తిగత సూచనలుగా కనపడుతున్నాయి. మరియు 1:13 లో పౌలు ఇలా చెప్తాడు, ''హిత వాక్య ప్రమాణమును గైకొనుము'' ఇది వ్యక్తిగత ప్రోత్సాహమును సూచిస్తుంది. 

అబద్ద బోధను గూర్చిన అంశం 2 తిమోతి పత్రిక లో చాల తక్కువగా కనపడుతుంది. తిమోతి కేవలం సంఘాన్ని హెచ్చరించేవాడుగాను మాత్రమే కాదు కానీ వాదములు పెట్టుకునే వారిని కూడా హెచ్చరించే వాడుగా ఉండాలి - 2 తిమోతి 2:24-26'' సత్యవిషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వానియురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వీకముతో శిక్షించుచు, జగడమడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించేవాడుగాను ఉండవలెను.'' 

2 తిమోతి గూర్చి Gordon Fee ఈ రీతిగా చెప్పాడు:

ఒక విధంగా ఇది మరణించే ముందు చెప్పే ఆఖరి కోరిక లేక ఆఖరి నిబంధనగా వున్నది. తిమోతి దేవుని వాక్యాన్ని ప్రకటించే వాడుగా మరియు దేనిని తీసుకెళ్ళేవాడుగా వున్నాడు. ఈ పత్రిక పౌలు తన బంధకాలలో నుండి వ్రాస్తున్నాడు అని గమనించండి. అతడు ఒక నేరస్తుడు వాలే బంధించబడి వున్నాడు (2:9). కానీ పౌలు యొక్క ఆలోచన ఏమనగా, దేవుని వాక్యము బంధించబడి యుండలేదు. అంటే కాకుండా "శ్రమలను అనుభవించుట" కొరకైనా పిలుపును పౌలు ఇస్తున్నాడు (1:8, 2:3-7; 3:14; 4:5). పౌలు యొక్క పరిచర్య - సువార్త ప్రకటించడం అనే పరిచర్యను తిమోతి కొనసాగించాలని పౌలు కోరుకొనుట అనేది ఈ పత్రిక యొక్క ఉద్దేశం.        

Written by Dr. Joel Madasu; Trans. Bro. Samuel Raj.


Tags

2 Timothy, 2వ తిమోతి


You may also like

The Triumphal Entry

The Triumphal Entry

Learn The Importance of Malachi

Learn The Importance of Malachi
{"email":"Email address invalid","url":"Website address invalid","required":"Required field missing"}

Get in touch

>